![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -232 లో.. కృష్ణ మెడలో మురారి తాళి కట్టింది ముకుంద గుర్తుచేసుకుంటుంది. అప్పుడే భవాని వచ్చి ఇంటి పెద్ద కోడలిగా అందరితో కలిసి నల్లపూసలు గుచ్చి మంచి పని చేశావని ముకుందతో భవాని అంటుంది. అవును అత్తయ్య అని ముకుంద అంటుంది.
ఆ తర్వాత ఇంట్లో ఎవరు కన్పించడం లేదు. ఎక్కడికి వెళ్లారని అంటుండగానే అప్పుడే మధు, ప్రసాద్ లు భవాని దగ్గరికి వస్తారు. వీళ్ళు అంత ఎక్కడ అని భవాని అడుగుతుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. వదిన ఫోన్ చూస్తూ రీల్స్ చేస్తుందని భవానితో ప్రసాద్ అంటాడు. అప్పుడే అందరు భవాని దగ్గరికి వస్తారు. కృష్ణ నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా.. నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా అని భవాని అడుగుతుంది. కృష్ణ మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఏంటి నువ్వు ఇంకొకసారి ఇలా ఉంటే ఒక్కటిస్తానని భవాని అనగా.. సరే అత్తయ్య అని కృష్ణ అంటుంది. అందరం ఇక్కడే ఉన్నాం కదా ఒక గ్రూప్ ఫోటో దిగుదామని గౌతమ్ అనగానే.. నేను మిమ్మల్ని అందుకే పిలిచానని భవాని అంటుంది. అందరూ గ్రూప్ ఫోటో దిగడానికి సిద్ధం అవుతారు. కొన్ని రోజుల్లో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. వెళ్లిపోయాక ఆ ఫోటోలో నన్ను చూసినప్పుడల్లా మోసం చేసిందని అనుకుంటారు. అందుకే ఈ గ్రూప్ ఫోటోలో నేను ఉండకూడదని కృష్ణ పక్కకి వెళ్ళిపోతుంది. భవాని కృష్ణ ఎక్కడ అని అడుగుతుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానని కృష్ణ దగ్గరికి రేవతి వెళ్తుంది. నువ్వు అక్కడ నుండి ఎందుకు వచ్చావో తెలుసు.. నీ కోసం అందరు ఎదురుచూస్తున్నారు పదా అని రేవతి అనగానే.. నా కోసం అందరిని బాధ పెట్టడం ఎందుకని.. సరే పదండి అని కృష్ణ వస్తుంది. ఆ తర్వాత అందరు గ్రూప్ ఫోటో దిగుతారు. ఎవరి జంటతో వాళ్ళు ఫోటో దిగుతారు. మళ్ళీ ఏసీపీ సర్ తో నన్ను ఫోటో దిగమంటారని కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరొకవైపు కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో చూస్తు.. తన బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. ఇంట్లో అందరికి అగ్రిమెంట్ విషయం చెప్తానని అన్నావ్ చెప్పలేదు. మళ్ళీ మంగళ్యధారణ ఆపుతానని అన్నావ్ అది జరగలేదు .నీ ప్రేమ గెలవదని అలేఖ్య అనగానే.. అలేఖ్యపై ముకుంద కోప్పడుతుంది. మరొకవైపు కృష్ణ ఏడుస్తూ తన బ్యాగ్ లో బట్టలు సర్దుతుంటుంది. మురారి ఇచ్చిన గిఫ్ట్ ని చూసి ఎమోషనల్ అవుతుంది కృష్ణ. కృష్ణ గురించి మురారి ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |